బీఎస్ఎన్ఎల్ న్యూ ప్లాన్స్....రూ.19కే 2 జీబీ డేటా

SMTV Desk 2019-03-31 17:40:05  బీఎస్ఎన్ఎల్ న్యూ ప్లాన్స్....రూ.19కే 2 జీబీ డేటా

మార్చ్ 31: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం ప్రత్యేక హాట్ స్పాట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.19 కు 2 జీబీ డేటా (వాలిడిటీ 2 రోజులు), రూ.39కు 7 జీబీ డేటా (వాలిడిటీ 7 రోజులు) అందస్తోంది. రూ.69కేమో 30 జీబీ డేటా (వాలిడిటీ 28 రోజులు) అందిస్తోంది. వైఫై హాట్‌స్పాట్ లొకేషన్లలో ఈ ప్లాన్‌లు పనిచేస్తాయి. వైఫై హాట్‌స్పాట్ దగ్గరకు వెళ్లి ఫోన్‌లోని వైఫై ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లస్ ఎస్ఎస్ఐడీ నెట్‌వర్క్ ఎంచుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ వంటి వాటిని వైఫైకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇతర యూజర్లు కూడా ఈ హాట్‌స్పాట్ సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే తొలి 30 నిమిషాలు మాత్రమే. తర్వాత ఏదో ఒక ప్లాన్ ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. అంతా బాగానే వుంది మరి మనకు బీఎస్ఎన్ఎల్ వైఫై హాట్‌స్పాట్స్ ఎక్కడున్నాయో తెలియదు కాదా? అనుకోవచ్చు. ఇందుకోసం సంస్థ వెబ్‌సైట్‌లో హాట్‌స్పాట్ లొకేషన్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. ఇక్కడ ప్రాంతం, టెలికం సర్కిల్ వివరాలు ఎంటర్ చేస్తే చాలు ఎక్కడ హాట్‌స్పాట్ ఉందో తెలిసిపోతుంది.