ధర్మం...అధర్మం మధ్యే ఈ ఎన్నికలు!

SMTV Desk 2019-03-31 16:02:43  ys jagan mohan reddy, chandrababu, tdp, ysrcp, loksabha elections, assembly elections

నెల్లూరు, మార్చ్ 31: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్బంగా నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపి సీఎం చంద్రబాబు పై జగన్‌ మండిపడ్డారు.చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మోసం తప్ప.. మరేమీ లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగరాజుపట్నం పోర్టు నిర్మిస్తామన్న హామీని బాబు మరచిపోయారని జగన్ విమర్శించారు. ధర్మం, అధర్మం మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని వైఎస్‌ జగన్ అన్నారు.