పాన్-ఆధార్ లింక్...నేడే ఆఖరి రోజు

SMTV Desk 2019-03-31 15:54:09  state government of telangana, telangana, pan card, adhar card, pan-adhar link

మార్చ్ 31: నేటితో ఆధార్ కార్డుతో పాన్ నెంబర్‌ను అనుసంధాన ప్రక్రియ ముగియనుంది. దీనిపై ప్రభుత్వ రంగ శాఖలు ప్రత్యెక దృష్టి సారించాయి. ఇదివరకే 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయాలంటే ఈ అనుసంధానం తప్పనిసరని తెలిపింది. మొత్తం నాలుగు విధానాల్లో ఈ అనుసంధానం చేసుకొనేట్లు ఆదాయ పన్ను శాఖ ఏర్పాట్లు చేసింది.

* ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో Aadhaar link విభాగంలో ఇది లభిస్తుంది.
* ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది. అవసరమైన వారు 567678 లేదా 56161 కు UIDPAN<12-digit Aadhaar><10-digit PAN>. అని మెసేజ్‌ చేయాలి.
* ఆన్‌లైన్‌లో ఆదాయపుపన్ను రిటర్ను ఫైల్‌ చేసే సమయంలో ఆధార్‌ సంఖ్యను పాన్‌ సంఖ్యతో అనుసంధానించాలని కోరవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐఐటీఎస్‌ఎల్‌ వెబసైట్లలో లభిస్తుంది.
* పాన్‌ కార్డు దరఖాస్తు సమయంలో కానీ, పాన్‌కార్డులో మార్పులకు దరఖాస్తు సమయంలో మనం ఆధార్‌ అనుసంధానాన్ని కోరవచ్చు.