పీఎస్‌ఎల్‌వీ-సీ 45 కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్

SMTV Desk 2019-03-31 15:18:33  ISRO to launch PSLV-C45, PSLV-C45, Sriharikota,

మార్చ్ 31: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీహరికోట షార్ నుంచి రేపు ఉదయం 9:27 నింగిలోకి దూసుకెల్లనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ 45 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఇది ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లనుంది. రాడార్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేస్తుంది. మొదట మన దేశానికి చెందిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన అనంతరం మిగిలిన విదేశీ ఉపగ్రహాలను ఒకదాని తరువాత ఒకటి కక్ష్యలోకి పంపనున్నారు. అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టబోతోంది ఇస్రో.