డబ్బులు ఇచ్చిన వారికీ పార్టీ సీట్లు

SMTV Desk 2019-03-31 15:16:20  ponguleti sudhakar reddy

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌కి మరో షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, ఏఐసీసీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖను అధినేత రాహుల్‌గాంధీకి పంపించారు. గతంలో కన్నా ఇప్పుడు పార్టీలో ధన రాజకీయాలు పెరిగిపోయాయని… అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికీ పార్టీ సీట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతోందని పొంగులేటి.. పార్టీ వీడడానికి ఇదే కారణం అంటూ తను రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల పార్టీ భ్రష్టుపడుతోందని.. హైకమాండ్ కు ఈ విషయం చెప్పినా ప్రయోజనం శూన్యం అని ఆయన అన్నారు.

కాగా పొంగులేటి సుధాకర్‌ రెడ్డి త్వరలోనే బీజేపీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం.