తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

SMTV Desk 2019-03-31 15:12:04  isro, ttd

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో పిఎస్‌ఎల్‌వి సి45 వాహకనౌక నమూనాతో శాస్త్రవేత్తలు ఆలయానికి చేరుకున్నారు. నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో వారికి ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పిఎస్‌ఎల్‌వి సి45 వాహకనౌక ప్రయోగం విజయవంతం కావాలని వారు శ్రీవారిని ప్రార్థించారు.

అదేవిధంగా శ్రీవారిని హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం జవాల్కర్‌కు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, దీవించారు.