వైరల్ వీడియో: పామును ఎగిరి తన్నిన ఎలుక

SMTV Desk 2019-03-31 12:50:42  Viral video,

వాయువ్య అమెరికాకు చెందిన కంగారు జాతి ఎలుకలు చాలా వేగంగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటే క్షణాల్లో దాని నుంచి మెరుపు వేగంతో తప్పించుకోగలవు. మీరు ఆశ్చర్యపోయేలా.. ఈ కంగారు జాతికి చెందిన ఒక ఎలుక తనను తినడానికి ఎదురు చూస్తున్న త్రాచు నుంచి తప్పించుకుంది. ఈ అద్భుతమైన సంఘటన అరిజోనా ఎడారిలో జరిగింది.


అసలు విషయంలోకి వెళ్తే ఒక కంగారు జాతి ఎలుక అరిజోనా ఎడారిలో తిరుగుతూ.. ఒక చోటుకు వచ్చి ఉంది. అయితే దానికోసం కాచుకుని ఉన్న పాముని గమనించలేదు. ఆ పాము అదును చూసుకుని వెంటనే ఎలుకను పట్టుకోవాలని చూసింది. కానీ ఈ ఎలుక దాని నోటి నుంచి విడిపించుకుని ‘నింజా’లా ఒక్కసారిగా పాము తల మీద ఎగిరి తన్ని పారిపోయింది. ఇక ఈ అద్భుతమైన దృశ్యం అక్కడే ఉన్న కెమెరాలకు చిక్కడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ఆ వీడియోను చూడండి.