ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్లు

SMTV Desk 2019-03-31 12:46:05  facebook,

యూజర్లకు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తుంటుంది ఫేస్‌బుక్. సామాజిక సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటుంది. వాటిని మరింత పెంచేందుకు, వైఫై నెట్ వర్కులను కనుక్కోడానికి రెండు అప్డేటెడ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది.

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌ వివరాలు తెలుసుకోడానికి nearby friends ఆప్షన్‌ను వాడుకోవచ్చు. యూజర్లు ఫోన్‌లోని నియర్ బై ఫ్రెండ్స్ ఫీచర్‌ యాక్టివేట్ చేయాలి. ఫ్రెండ్స్ పేర్లను అందులో యాడ్ చేయాలి. వారు మనకు దగ్గర్లో ఉన్నప్పుడు వారిని కలుసుకోవాలంటే , ఈ ఆప్షన్ వారు కూడా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ టర్న్ ఆన్ చేసుంటే దగ్గర్లోని ఫ్రెండ్స్ వివరాలు కనిపిస్తాయి. పై ప్రత్యక్షమవుతాయి. ఇక దగ్గర్లోని వైఫైని కనుక్కోడానికి ఫేస్‌బుక్ యాప్‌లోని మోర్ సెక్షన్‌లోకి వెళ్లి, find wifi ఆప్షన్‌ని యాక్టివేట్ చేయాలి. తర్వాత జీపీఎస్‌ను ఆన్ చేస్తే మనకు దగ్గరల్లోని వైఫై హాట్‌స్పాట్ వివరాలు మ్యాప్స్‌ రూపంలో కనిపిస్తాయి.