ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ కు చేదు అనుభవం

SMTV Desk 2017-08-14 11:48:36  YSRCP, YS Jagan, Namdyala road show, Jagan, Namdyala by-polls

నంద్యాల, ఆగస్ట్ 14: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు కూడా నియోజక వర్గం మొత్తం చుట్టేస్తున్నాయి. అయితే వైసీపీ పార్టీకి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన రోడ్‌ షో జనం లేకపోవడంతో రెండున్నర గంటలు ఆలస్యమైంది. ఉదయం 9 గంటలకు ఆయన రోడ్ షో ప్రారంభించి, తరువాత స్థానిక శ్రీనివాస సర్కిల్‌లో ప్రసంగించాల్సి ఉంది. అయితే జనాలు రాకపోవడంతో రోడ్ షో ప్రారంభించలేదు. దీంతో అక్కడికి సమీపంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే రామనాథ్‌ రెడ్డి కుమారుడు, వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి ఇంట్లో రెండున్నర గంటలపాటు జగన్ నిరీక్షించారు. కొద్ది సమయం తరువాత జనాలు చేరడంతో 11:30 గంటల సమయంలో ఆయన రోడ్ షో ప్రారంభించారు.