త్వరలో ముగియనున్న పాన్, ఆధార్ కార్డ్ లింక్ గడువు...

SMTV Desk 2017-08-14 11:26:22  PAN CARD, ADHAAR CARD, LINK, IT RETURNS

న్యూఢిల్లీ, ఆగస్ట్ 14 : పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పాన్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోతే కార్డులు చెల్లకుండా పోతాయని ప్రకటించడంతో ఇప్పటి వరకు 9.3 కోట్ల మంది అనుసంధానం చేసుకున్నట్టు ఆదాయపన్ను అధికారులు తెలిపారు. కాగా జూన్, జూలై నెలల్లో మూడు కోట్ల మంది పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోగా, ఆగస్టు 5 నాటికి ఐటీ రిటర్నులు దాఖలుకు చివరి తేదీ అని తెలపడంతో ఆదాయపు పన్ను శాఖ వద్ద 9.3కోట్ల మంది పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసినట్లు తెలిపారు. దేశంలో మొత్తం 30 కోట్ల మంది పాన్‌కార్డులు కలిగి ఉండగా వారిలో 30 శాతం మంది ఆధార్‌తో తమ పాన్ కార్డులను అనుసంధానం చేశారని వివరించారు. అయితే ఈ పాన్‌కార్డు-ఆధార్‌కార్డు అనుసంధానానికి ఈ నెల 31 చివరి తేదీ.