జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పనున్న రోజా

SMTV Desk 2019-03-30 19:12:01  roja, jabardasth,

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతున్నాయి. గెలుపు కోసం ప్రజల్లోకెళ్లి ప్రచారం చేస్తూ.. హామీలు కురిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ నుంచి పులువురు సినీ నటులు కూడా పోటీకీ దిగి వారి రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు.

గత ఎన్నికల్లో సినీనటి రోజా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరుపున ఆమె గెలవడంతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే.. రోజా జబర్ధస్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.

జగన్ ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. రోజాకు ఎమ్మెల్యేగా గెలిపొందింతే ఆమెు క్యాబినేట్‌లో చోటు దక్కడం ఖాయమని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రోజా ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ.. ఓ ఛానెల్‌లో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రాంకు నిర్ణేతగా వ్యవహరిస్తోంది. క్యాబినేట్ పదవి రోజాను వరిస్తే.. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రోగ్రాం చేయడం కష్టంమని, అందుకే ఆమె జబర్ధస్త్ ప్రొగ్రాం నుంచి తప్పుకోవడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.