రానున్న నాలుగు రోజులపాటు వర్షాలే..!

SMTV Desk 2017-08-14 10:10:11  TELANGAANA STATE, RAIN FALL, WEATHER REPORT

హైదరాబాద్, ఆగస్ట్ 14 : రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. కాగా నిన్న హైదరాబాద్ లో 4 సెంటీమీటర్లు, బోధ్ లో 3 సెంటీమీటర్లు, సంగారెడ్డి, ఉట్నూరు తదితర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా పలు చోట్ల కరువు పరిస్థితే నెలకొంది. జూలైలో 24.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి వుండగా 5.8 సెం.మీ మాత్రమే కురిసిందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు మరింత ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా పత్తి, కంది, మొక్కజొన్న, సోయా తదితర పంటలకు నీరందుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.