'లక్ష్మీస్ ఎన్టీఆర్' తొలిరోజున భారీ వసూళ్లు

SMTV Desk 2019-03-30 18:56:31  Laksmis NTR,

ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుంచి జరిగిన సంఘటనల సమాహారంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందించాడు. కుటుంబ కుట్రల చిత్రం అనే ట్యాగ్ లైన్ .. అసలైన కథ ఇదేనంటూ చేసిన ప్రచారం ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

ఏపీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వడం వలన అక్కడ మినహా ఈ సినిమా మిగతా ప్రాంతాల్లో నిన్న విడుదలైంది. తెలంగాణలోను .. ఓవర్సీస్ లోను ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. విడుదలైన అన్ని ప్రాంతాలలోను తొలి రోజున ఈ సినిమా 4 కోట్ల గ్రాస్ ను సాధించినట్టుగా చెబుతున్నారు. శని .. ఆదివారాల్లో ఈ జోరు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏపీలో విడుదలైతే అక్కడి పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి