ఆయన మా కుటుంబ సన్నిహితుడే : భూమా మౌనిక

SMTV Desk 2017-08-13 18:52:34  Bhuma Mounika, Bhuma Akhilapriya, Janasena, Pawan kalyan, Namdyala by-polls

నంద్యాల, ఆగస్ట్ 13: నంద్యాల ఉపఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఇంత వరకు జనసేన అధినేత తన మద్దతు ఎవరికి ప్రకటించలేదు. కాగా, ఇటీవల మంత్రి భూమా అఖిల ప్రియ పవన్ కళ్యాణ్ మద్దతు మాకే అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు భూమా నాగిరెడ్డి చిన్న‌ కూతురు భూమా మౌనిక ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ మద్దతు తమకే ఉంటుందన్నారు. మొదట నుంచి ఆయన మా తల్లిదండ్రులకు మద్దతిచ్చారు అలాగే ఇప్పుడు మాకు మద్దతు ఇస్తారని ఆమె ధీమా వ్యక్త పరిచారు. నంద్యాల ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్న సంగతి విదితమే.