ఆర్.ఆర్.ఆర్ షూట్ లో అలియా భట్

SMTV Desk 2019-03-30 11:57:04  rrr, alia bhatt,

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మూడవ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పాల్గొంటుందని తెలుస్తుంది. సినిమాలో రామరాజు అదేనండి రాం చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంది. కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్.టి.ఆర్ కు జతగ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుంది.

జరుగబోయే ఈ షెడ్యూల్ లో అలియా భట్ జాయిన్ అవుతుందట. డైసీ ఎడ్గర్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌళి. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 31న రిలీజ్ ఫిక్స్ చేశారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.