మనీలా లో ఉగ్రవాదుల కాల్పులు

SMTV Desk 2017-06-02 13:42:31  terrorist,polics,manila,

మనీలా, జూన్ 1 : మనీలా లోని ఫిలిప్పీన్స్ లో ఐఎస్ ఉగ్రవాదులు మరొకసారి విరుచుకు పడ్డారు. మనీలా లోని ఓ క్యేసినో హోటల్ పై గురువారం రాత్రి ఉగ్రవాదులు తుపాకులు,బాంబులతో విద్యంసం సృష్టించారు. ఈ ఘటనలో 25 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ చుట్టూ ముట్టి హోటలో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసారు. ఈ కాల్పులు తామే చేసామని ఇస్లామిక్ దేశం ప్రకటించింది. ఈ కాల్పులు జరిగిన వద్ద రిసార్ట్స్ వరల్డ్ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ విమానాశ్రయనికి సమీపంలో ఉంది. ఈ కాల్పులు జరుపడని కి వచ్చిన ఉగ్రవాదులు ముఖానికి ముసుగును వేసుకొని వచ్చి కాల్పులు జరిపారని ప్రత్వేక్ష సాక్షులు చేబుతునారు. హోటల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించడం తో అందరు భయపడి చాల మంది రెండో అంతస్తు పైనుంచి కిందకు దుకేశారని వివరించారు. ఐతే ఈ ఘటనకు సంభందించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. గురువారం అర్థరాత్రి దాటాక కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిలిప్పీన్స్ లోని ఐఎస్ ఉగ్రవాదులు కొంతకాలం గా భీభత్సం సృష్టిస్తున్నారు. దానితో ఇక్కడ కొన్న ప్రాంతాల్లో మార్షల్ లా అమలు చేస్తున్నారు. ఐఎస్ ఉగ్రవాదుల దాడిలో ఇప్పటివరకు 171 మంది చనిపోవడం జరిగింది.