100 కోట్ల క్లబ్ లోకి ‘కేసరి'

SMTV Desk 2019-03-29 15:51:58  Kesari , akshay Kumar,

బాలీవుడ్ కిలాడీ అక్ష‌య్‌కుమార్ చేసిన తాజా చిత్రం ‘కేసరి . ఈ సినిమా .. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. ఏడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతవరకూ అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో, 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 11వ సినిమా ఇది. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.