బిజెపి ప్రభుత్వం కేవలం ధనికుల కోసమే

SMTV Desk 2019-03-29 15:41:51  BJP, Priyanka gandhi

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఐదేళ్లూ అబద్ధాలనే ప్రచారం చేస్తూ కాలం గడిపిందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రియాంకా గాంధీ ప్రసంగాలు చేశారు. స్థానికులతో ముచ్చటించారు. బిజెపి ప్రభుత్వం రైతులకు, సాయుధ దళాలకు వ్యతిరేకంగా పని చేసిందని ఆమె విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కేవలం ధనికుల కోసమే పని చేసిందని ఆమె అన్నారు. దేశంలో ఎలాంటి ‘వికాస్‌’ లేదని ఆమె చెప్పారు. బిజెపి ప్రభుత్వం చేపట్టిన విఫల విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.