ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

SMTV Desk 2019-03-29 13:14:03  AP cm,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. ఈసీ అధికారాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టిన విషయం తెలిసిందే.

కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీల నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం... ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీని మాత్రం నిలిపేసింది. ఆయన ఎన్నికల విధుల్లోకి రారంటూ ఏపీ ప్రభుత్వం వాదించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక జీవోను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ అంశాన్ని హైకోర్టులోనూ ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై ఈసీ, ఏపీ ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హైకోర్టు... ఐపీఎస్ల బదిలీలను నిలిపివేయాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది.