రెబెల్స్ ని నచ్చచెప్తున్న చంద్రబాబు

SMTV Desk 2019-03-29 10:50:17  chandrababu, AP Cm,

చంద్రబాబు చాల ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నికలకు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు ని మించిన వారు ఇంకొకరు లేరు. ఇప్పటి వరకు ఆయన దాదాపుగా 7 ఎన్నికలు చూశారు. ఎవరిని ఎలా ఆకర్షించాలో, ఎలా చేస్తే ప్రజలు తనకు ఓట్లు వేస్తారో, ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలా ముందుకెళ్లాలి అని చంద్రబాబుకి తెలిసినట్లుగా మరెవరికి తెలియదు. అంతేకాకుండా ఎవరైనా ఎదురు తిరిగితే , వారిని ఎలా కంట్రోల్ చేయాలో, వారికోసం చంద్రబాబు ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తారు చంద్రబాబు.

గురువారంతో నామినేషన్ ల గడువు పూర్తవడంతో, తనకు తెలిసిన వ్యూహాలతో చంద్రబాబు అక్కడి రెబల్స్ ని కంట్రోల్ చేశారు. తిరుగుబాటుదార్లందరికి చంద్రబాబు నచ్చజెప్పి అందరిని సర్దుమణిగేలా చేశారు. ఒకవేళ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే వారికి నియామక పదవులు లేదా ఎమ్మెల్సీ పదవులను అప్పగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీతో రెబల్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుని టీడీపీ విజయానికి కృషి చేస్తామని చంద్రబాబుకి హామీ ఇచ్చారు. దీంతో.. పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దెబ్బతో దాదాపుగా చంద్రబాబుకి ఎదురే లేకుండా పోయింది.