‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై మంగళగిరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్

SMTV Desk 2019-03-28 19:14:17  Laksmis NTR,

సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం ఈ చిత్రాన్ని ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బ కోట్టేందుకు తీశారంటూ..ఎన్నికలు అయ్యేవరకు చిత్ర విడుదలను ఆపమని న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ముందుగా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన వారు…ఆ తరవాత కోర్టులో పిటిషన్ వేశారు.

తాజాగా ఈ విషయంపై కోర్టు స్పందించింది. ఏప్రెల్ 15 వరకు సినిమా విడుదలపై మంగళగిరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు సినిమా హాల్స్‌లో మూవీ ప్రదర్శన నిలపివేయాలని తేల్చి చెప్పింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయడానికి అనుమతులు నిలిపివేసింది. ఈ మేరకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.