రాజకీయాల్లోకి రామ్ గోపాల్ వర్మ..పవన్ కళ్యాణ్‌పై పోటీ

SMTV Desk 2019-03-28 14:38:10  RGV, pawan klayan

సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎవరితో వివాదాలు పెట్టుకుంటాడో అస్సలు ఊహించలేం. ఈమధ్య పవన్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన వర్మ అప్పుడప్పుడు ఆయన్ను పొగుడుతూ, ఇంకొన్నిసార్లు విమర్శిస్తూ అభిమానులతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి తెరలేపింది.

నిన్న అర్థరాత్రి వర్మ తాను ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగుతానని, అది కూడా భీమవరం నుండే అని అన్నారు. నామినేషన్ల గడువు ముగిసినా స్పెషల్ పర్మిషన్ మీద నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. పోటీకి దిగుతున్న వర్మ భీమవరం బరిలో ఉన్న మిగతా పార్టీల అభ్యర్థుల్ని ప్రస్తావించకుండా కేవలం పవన్ మీద పోటీకి అంటుండటం జనసేన అభ్యర్థుల్లో కలకలం రెపుతోంది.

నేరుగా పవన్ ను ఓడించలేక ప్రత్యర్థులు ఇలా వర్మను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అసలు వర్మ చెప్పినట్టు నిజంగానే పొటీకి దిగుతాడా లేకపోతే ఆఖరున ఊరికే సరదాకి మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ట్వీట్ చేశా అంటాడో చూడాలి.