5 గంటల్లోనే ప్రభావం చూపించిన స్పైడర్ మూవీ టీజర్

SMTV Desk 2017-06-02 13:35:14  Maheshbabu,Superstar krishna,Reliance entertainment,Spider teezer

హైదరాబాద్, జూన్ 2 : మహేష్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రాన్ని వాణిజ్యపరమైన అంచనాలు అందుకునే విధంగా అన్ని హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఠాగూర్ మధు సమర్పణలో ఈ భారీ చిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తుండగా, ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుధవారం ఈ చిత్రం టీజర్ విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, ఆ రోజున దాసరి నారాయణరావు హఠాన్మరణంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి గురువారం రోజున ఉదయం విడుదల చేశారు. విడుదలైన 5 గంటల్లోనే స్పైడర్ టీజర్ ను 2 మిలియన్ మందికి పైగా వీక్షించడమే కాకుండా, లక్ష ఇరవై వేల లైకులను సాధించిందంటే ఈ సినిమాపై ప్రేక్షకుల ప్రభావం ఎంత ఉందో గమనించవచ్చు.