అవినాష్ కి 30 వేల మెజారిటీ !

SMTV Desk 2019-03-28 11:31:17  avinash, kodalinani

అనేక సర్వేలు ఈ సారి గుడివాడలో ప్రజా తీర్పు టీడీపీ వైపు ఉండబోతోందని, గత రెండు మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతో ప్రజల్లో ఉందని, ఈసారి గుడివాడ వాసులు మార్పు కోరుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే ధీమా తనకు ప్రజాక్షేత్రంలో కనిపించిందని దేవినేని అవినాష్‌ దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడు, ఉన్నత విద్యావంతుడు అయిన. అనేక సర్వేలు టీడీపీ చేయించాకే అవినాష్‌ను గుడివాడ బరిలో దింపిందనే విషయం అందరికీ తెలుసు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదిహేనేళ్లుగా ఏ మాత్రం పనిచేయని వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుడిపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అవినాష్ అంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో యువత, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని తరగతుల ప్రజల నుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని 30 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని అయన అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేక, కుల రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కుటిల రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టడం తథ్యం. ఎన్నికల సమయంలో మాటల గారడీ చేసి ఆనక కన్పించని నాయకుల గురించి ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. నేను 18 ఏళ్ల వయస్సులోనే విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించానని. విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమైక్యాంధ్ర ఉద్యమంలో లక్ష మందితో విజయవాడలో ధర్నా చేపట్టిన చరిత్ర తనది అని అవినాష్ అంటున్నారు.