సంక్షేమం, అభివృద్ధి రెండూ టీడీపీకి జోడెడ్ల బండిలాంటివి : లోకేష్

SMTV Desk 2019-03-28 11:22:34  Nara Lokesh, KTR,

ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. జగన్ పేరును కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డిగా మార్చుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధులకు ఫోన్ చేసి ఆయన భయపెడుతున్నారని తెలిపారు. పోలవరం ముంపు మండలాలను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. అంతేకాకుండా జగన్ మోహన్ రెడ్డి స్విచ్ కేసీఆర్ వద్ద ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేశాడని లోకేశ్ వివరించారు.

అంతేకాకుండా భారతదేశంలో ఒక్క ఆంధ్రాలో తప్ప ఎక్కడా కూడా రూ.2000 పెన్షన్ ఇవ్వడం లేదని.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం చంద్రబాబు 120 పథకాలు పెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. పంచాయితీ రాజ్ శాఖలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశామని వెల్లడించారు లోకేశ్. అలాగే.. సంక్షేమం, అభివృద్ధి రెండూ టీడీపీకి జోడెడ్ల బండిలాంటివని లోకేశ్ తెలిపారు.