చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్

SMTV Desk 2019-03-28 11:14:06  chandra Babu, KTR

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా రాజకీయ నాయకులు ఇకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో జగన్‌పై నిప్పులు కురిపిస్తున్న చంద్రబాబు.. కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటి? అన్న జగన్ ప్రశ్నపై స్పందించారు. కేటీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్ ప్రశ్నిస్తున్నారని, ఆంధ్రావాళ్లు ద్రోహులు, దొంగలు, తెలంగాణలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతానన్న వాళ్లతో చేతులు కలపడం జగన్‌కే చెల్లించదని బుధవారం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్న మీరు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఎందుకు పొత్తుపెట్టుకోవాలనుకున్నారో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. హరిక్రిష్ణ భౌతికగాయం వద్ద కేటీఆర్ తో చంద్రబాబు చర్చించిన సంగతి తెలిసిందే.