రావడం, అడ్డుకోవడం.. షరా మామూలే.!

SMTV Desk 2017-08-12 13:47:09  MUDHRAGADA PADMANABHAM,

కిర్లంపూడి, ఆగస్ట్ 12 : ముద్రగడ పాదయాత్రలో మళ్ళీ సీన్ రిపీట్ అయింది. పద్మనాభం పాదయాత్రకు ఇంటి నుండి బయటికి రావడం, పోలీసులు అడ్డుకోవడం మామూలైపోయింది. ఎప్పటిలాగే ఈరోజు కూడా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు బయలుదేరారు. కాని ఆయనను ఓఎస్డీ రవిశంకర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు అడ్డుకొని అనుమతి లేదంటూ తెలిపారు. దీనిపై ఆయన మండిపడుతూ బందోబస్తుగా వేలాది పోలీసులను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో తాము శాంతియుత పాదయాత్రను చేపట్టామని దీనిని అడ్డుకోవడం ఒక నిరంకుశ చర్య అంటూ ముద్రగడ అభివర్ణించారు.