తేజ్ కోసం ఎన్టీఆర్

SMTV Desk 2019-03-27 13:15:45  Sai Dharam Tej, NTR

ఒక ఫ్యామిలీ హీరో ఫంక్షన్‌కు మరో ఫ్యామిలీ హీరో అతిథిగా రావడం టాలీవుడ్‌లో కొత్తేం కాదు. నిజానికి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఈ పద్దతి బాగా పెరిగింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు హీరోలు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో నటించాడు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ మూవీకి గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పెట్టాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ ఫంక్షన్ అతిథిగా ఎన్టీఆర్‌ను తీసుకురావాలని వారు భావిస్తున్నారట. అందుకోసం అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఫంక్షన్‌కు అతిథిగా వచ్చేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటారని వారు భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా మారనున్నాడు.