పోలీసులకే సవాల్ విసురుతున్న ఓ యువకుడు

SMTV Desk 2017-08-12 13:19:03  GUN SHOOTING, YOUNG MAN CHALLENGE TO THE POLICE.

రాజస్థాన్, ఆగస్ట్ 12 : ఒక యువకుడిని దారుణంగా కాల్చి చంపడమే కాకుండా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసురుతున్నాడో ప్రబుద్దుడు. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్ లోని గంగానగర్ కు చెందిన దీపక్ మాలిక్ అనే యువకుడికి ఇందుబాల స్నేహితురాలు. కాగా గతంలో ఆమె హర్యానాకు చెందిన వినోద్ అనే యువకుడితో సన్నిహితంగా మెలిగేది. అయితే తన ప్రేమకు అడ్డు వస్తాడేమో అని దీపక్, ఇందుబాలతో కలిసి పక్కా ప్లాన్ చేసుకొని వినోద్ ను తుపాకీతో కాల్చి చంపేసి, పరారయ్యాడు. అంతేకాకుండా పోలీసులకే సవాళ్లు విసురుతున్నాడు. ప్రతిరోజు ఫేస్ బుక్ లో తుపాకులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ తనను పట్టుకోవాలంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు. దీపక్ ను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా ఇందుబాల మాత్రం పోలీసుల కస్టడీలోనే ఉంది.