ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు ఎదురుదెబ్బ

SMTV Desk 2019-03-27 10:54:29  MLC elections, TRS,

నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాద్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. సిపిఎం బలపరిచిన టి.ఎస్.యు.టి.ఎఫ్. అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతిలో తెరాస బలపరిచిన పి.ఆర్.టి.యు.అభ్యర్ధి పూల రవీందర్ ఓడిపోయారు. నర్సిరెడ్డికి 8,924 ఓట్లు రాగా, పూల రవీందర్‌కు 6,287 ఓట్లు వచ్చాయి. కనుక రవీందర్‌పై నర్సిరెడ్డి 2,637 ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించారు.