మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీష్ కు బెయిల్ మంజూరు

SMTV Desk 2019-03-27 10:47:21  pakistan former president, Nawaz Sharif khan, pakistan supreme court

ఇస్లామాబాద్, మార్చ్ 26: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీష్ కు ఆరోగ్య కారణాలపై సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న షరీఫ్ చికిత్స చేయించుకొనేందుకు ఆరు వారాల బెయిల్ ఇచ్చింది సుప్రీం. షరీఫ్ (69) గత ఏడాది డిసెంబర్ నుంచి జైల్లో ఉన్నారు. షరీఫ్ ను అల్-అజీజియా స్టీల్ మిల్స్ లంచాల కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 25న ఇస్లామాబాద్ హైకోర్ట్ ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీని తర్వాత మార్చి 6న షరీఫ్ ఈ అప్పీల్ దాఖలు చేశారు.