బెంగళూరు నార్త్, సౌత్‌ లోక్ సభ అభ్యర్థులు

SMTV Desk 2019-03-27 10:42:42  lok sabha elections, bjp, congress, bengulore north, krishna byre gowda, benugulore south, lawyer tejaswi surya

బెంగళూరు, మార్చ్ 26: లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర బెంగళూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కృష్ణ బైరె గౌడ పోటీకి సిద్దం అయ్యారు. ఈ విషయం ఏఐసిసి ప్రెస్‌నోట్‌ను ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. బెంగళూరులోని ఉత్తర నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా బెంగళూరు సౌత్‌ సీటుకు బిజెపి యువ న్యాయవాది తేజస్వీ సూర్య నామినేట్‌ అయ్యారు. ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా మొదట్లో చర్చలు నడిచాయి. చర్చల అనంతరం తేజస్వీ సూర్య పేరును ఖరారు చేస్తూ నియోజకవర్గ ఆభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. కేంద్ర మంత్రి అనంత కుమార్‌ బెంగళూరు సౌత్‌ నుండి ప్రాతినిధ్యం వహించారు.కాంగ్రెస్‌ వెటరన్‌ హరిప్రసాద్‌ తో తేజస్వీ తలపడుతున్నారు.