‘సూర్యకాంతం’ ట్రైలర్

SMTV Desk 2019-03-27 10:32:38  surya kantham

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలు నిరాశపరచాయి. నిహారిక లేటెస్ట్ మూవీ సూర్యకాంతం. ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. టీజర్ లోనే సూర్యకాంతంగా నిహారిక షాక్ ఇవ్వగా ట్రైలర్ లో విశ్వరూపం చూపించింది.

ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తున్న నిహారిక నిజంగానే సూర్యకాంతం సినిమా కోసం బాగా కష్టపడినట్టు అనిపిస్తుంది. రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పెర్లెన్ బెసారియా కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. వరుణ్ తేజ్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించారు. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా నిహారికకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.