యాపిల్ న్యూ సర్వీసెస్....TV, Credit cards

SMTV Desk 2019-03-27 10:27:33  apple, apple tv, apple tv plus, apple credit card

మార్చ్ 26: దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ సంచలన ప్రకటనలు చేసింది. యాపిల్ మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను ఆవిష్కరించింది. అలాగే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకువస్తామని ప్రకటించింది. యాపిల్ టీవీ ప్లస్ అనేది స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వీడియో సర్వీస్. ఇందులో కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కంటెంట్ ఉంటుంది. దీనికోసం కంపెనీ 34 టీవీ, మూవీ ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది సబ్‌స్క్రిప్షన్ సర్వీస్. నెలకు కొంత మొత్తం చెల్లించాలి. ధర ఎంతైంది కంపెనీ ప్రకటించలేదు. కంపెనీ యాపిల్ టీవీ ఛానల్స్ సబ్‌స్క్రైబ్ సేవలను కూడా ఆవిష్కరించింది. ఇందులో హెచ్‌బీవో, స్టార్జ్, షోటైమ్, సీబీఎస్ ఆల్ యాక్సెస్, స్మిత్‌సోనియన్ ఛానల్, ఎపిక్స్, ఎంటీవీ హిట్స్ వంటి పలు పాపులర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకొని యాపిల్ టీవీ యాప్‌లో చూడొచ్చు. కంపెనీ యాపిల్ టీవీ యాప్‌ను కొత్త డిజైన్‌తో మళ్లీ ఆవిష్కరించింది. యాపిల్ టీవీ యాప్.. ఐఫోన్, ఐపాడ్, యాపిల్ టీవీ కస్టమర్లకు యాపిల్ టీవీ యాప్ మే నెలలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. యాపిల్ న్యూస్ ప్లస్ అనేది కంపెనీ న్యూస్ యాప్. ఇందులో వివిధ మేగజైన్ల కంకంటెంట్ అందుబాటులో ఉంటుంది. దీనికి కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వైర్డ్, పాపులర్ సైన్స్, నేషనల్ జాగ్రఫీ అండ్ ఎసెన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.