రిటైర్మెంట్‌ పై క్లారిటీ ఇచ్చిన యువీ

SMTV Desk 2019-03-26 18:44:08  team india senior cricketer, yuvraj singh, yuvraj singh retirement

మార్చ్ 26: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన రిటైర్మెంట్‌ గురించి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ..."రిటైర్‌ అయ్యేందుకు తగిన సమయం వచ్చేసిందని భావించిన రోజున ఎవరూ చెప్పకుండానే అందరికంటే ముందుగా నేను ఆ పని చేస్తా. గత రెండేళ్లుగా చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఒక దశలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు" అని అన్నాడు. తన రిటైర్మెంట్ విషయంపై క్రికెట్‌ దిగ్గజం క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌తో మాట్లాడానని చెప్పాడు. తన వయసులోనే ఉన్న సమయంలో సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడని యువరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. సచిన్‌తో మాట్లాడిన తర్వాత తనలో ఆందోళన తగ్గిందని కూడా యువరాజ్ వెల్లడించాడు.