ఎన్నికల్లో పోటీ చేయను : సంజయ్ దత్

SMTV Desk 2019-03-26 18:40:32  bollywood actor sanjay dutt, lok sabha elections, congress

ముంబయి, మార్చ్ 26: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోటీ చేయనున్నారని జోరుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను సంజయ్ దత్ కొట్టిపారేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ నుంచి పలు మార్లు ఎంపిగా పని చేశారు. తండ్రి అడుగుజాడల్లోనే సంజయ్ సాగుతారని కొంతకాలంగా వార్తలు రాగా, వాటిని ఆయన కొట్టి పారేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సోదరి, కాంగ్రెస్ ఎంపి ప్రియాదత్ కు తాను పూర్తి మద్దతు ఇస్తానని ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రజల సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.