ఆర్జివితో మోహన్ బాబు ఏం మాట్లాడాడు.

SMTV Desk 2019-03-26 17:09:31  rgv mohan babu

శత్రువుకి శత్రువు అంటే మనకు మిత్రుడే అన్న ఓ మాట ఉంది.. లేటెస్ట్ గా ఆర్జివి, మోహన్ బాబులు కలిసి దిగిన పిక్ చూస్తే అదే మాట గుర్తుకొస్తుంది. ఇంతకీ వీరిద్దరికి కామన్ శత్రువు ఎవరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో చంద్రబాబుని ఎటాక్ చేస్తున్న ఆర్జివి.. తన స్కూల్ ఫీజుల విషయంలో ప్రభుత్వం నుండి రావాల్సిన రీయింబర్స్ మెంట్ విషయంలో మోహన్ బాబు, చంద్రబాబుని డైరెక్ట్ గా ఎటాక్ చేస్తున్నాడు.

ఈ ఇద్దరు కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్జివితో మోహన్ బాబు ఏం మాట్లాడాడు.. అసలు ఆ ఇద్దరు ఎందుకు కలిశారు అన్నది తెలియలేదు కాని ఆర్జివి మాత్రం మోహన్ బాబు చంద్రబాబు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. మోహన్ బాబుతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి ఇంత f..k, b..d అని తెలియదని ట్వీట్ చేశాడు ఆర్జివి. అందులో మొదటిది మోహన్ బాబు ఫేమస్ డైలాగ్ ఫసాక్ అని మొదటి దాన్ని అనుకున్నా రెండోది ఏదై ఉంటుందా అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. ఏది ఏమైనా మోహన్ బాబుతో గొడవ చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారింది. కొద్ది నిమిషాల క్రితం వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసిపిలో చేరినట్టు తెలుస్తుంది.