‘పీఎం న‌రేంద్ర మోదీ’విడుదల ఆపేయాలి : కాంగ్రెస్

SMTV Desk 2019-03-26 16:59:40  pm narendra modi, indian prime minister, narendra modi, vivek obray, congress party, loksabha elections, election commission of india

న్యూఢిల్లీ, మార్చ్ 26: భారత ప్రధాని నరేంద్ర మోది జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పీఎం న‌రేంద్ర మోదీ’. అయితే ఈ సినిమాను విడుదల చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ సినిమా విడుదలతో ఓటర్లను ప్రభావితం చేసే అవకావం ఉన్నందున సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. అయితే ఏప్రిల్‌ 5న సీఎం నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల కానుంది. ఏడు దశ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు సినిమా విడుదలను ఆపాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది.