ఢిల్లీ లో అలజడి సృష్టించిన భూకంపం

SMTV Desk 2017-06-02 12:09:01  earthquake in delhi , total ricter 4.9 , haryana,gohana,30mrs a

హైదరాబాద్, జూన్ 2 : దేశ రాజధాని అయిన డీల్లిలో శుక్రవారం తెల్లవారు జామున 4.30 నిమిషాలకు భూప్రకంపనలు వణికించింది. దాదాపు నిమిషం పాటు బలమైన ప్రకంపనలు రావడంతో అందరు భయందోళానతో ఉలిక్కిపడి నిద్రలేచారు. ఢిల్లీ తో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎంసీఆర్) మొత్తం కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత సుమారు 4.9 గా నమోదైనట్టు అమెరిక జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హర్యానాలోని గోహనా ప్రాంతంలో 30 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైనట్టు స్వష్టం చేశారు.