కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను కూడా ఆదుకోండి

SMTV Desk 2019-03-26 16:57:54  Vijay mallya, Indian Government, Assets attached, Twitter, king fisher airlines, sbi, jet airways

న్యూఢిల్లీ, మార్చ్ 26: జెట్‌ఎయిర్‌వేస్‌ కంపెనీ బోర్డు నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ నరేశ్‌ గోయల్‌, భార్య అనితా గోయల్‌ బోర్డు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పుల ఊబిలో ఉన్న జెట్‌ను కాపాడేందుకు ఎస్‌బిఐ దేశీయ రుణదాతల పరిష్కార ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య బోర్డు నుంచి వైదొలిగారు. అయితే ఈ పరిణామాలపై తాజాగా విజయ్ మల్ల్యా స్పందించాడు. జెట్‌ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ముందుకు వచ్చిన ఎస్‌బిఐ కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను కూడా అలాగే కాపాడండి అని ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరారు. తన ఆస్తులను తీసుకుని జెట్‌కు సాయం చేయండంటూ వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకుని ఎందరో ఉద్యోగాలను, సంస్థను కాపాడటం ఆనందంగా ఉంది. ఐతే కింగ్‌ఫిషర్‌ను కూడా ఇలాగే ఆదుకుని ఉంటే బాగుండేది అని అన్నారు.