లాభాల వైపు దేశీ స్టాక్ మార్కెట్

SMTV Desk 2019-03-26 16:41:00  Sensex, Nifty, Stock market, Share markets

మార్చ్ 26: సోమవారం నాడు ఒక్కసారిగా కుప్పకూలిన దేశీ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతోంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 37,809 పాయింట్లతో పోలిస్తే 77 పాయింట్ల లాభంతో 37,886 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,354 పాయింట్లతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 11,375 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. నిఫ్టీ 50లో ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, గెయిల్, రిలయన్స్, వేదాంత, ఎస్‌బీఐ, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్ దాదాపు 2 శాతం పెరిగింది. అదేసమయంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, యూపీఎల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ దాదాపు 2 శాతం క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.