రూ. 143.47 కోట్లను సీజ్ చేసిన ఈసీ

SMTV Desk 2019-03-26 14:23:13  EC, seized, money

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా 29 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 143.47 కోట్లను సీజ్ చేశారు. రూ. 89.64 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 131.75 కోట్ల విలువ చేసే డ్రగ్స్, రూ. 162.93 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, రూ. 12.202 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు.