జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా?

SMTV Desk 2019-03-26 13:03:17  Jagan, CM KCR,

విజయవాడ: జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా? లేక అంతకంటే ఎక్కువే ఇచ్చారా? అన్న విషయాన్ని త్వరలోనే బయటపెడతామని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా నోరుమెదపని జగన్, కేసీఆర్ తో కలిసి ‘హోదా’ సాధిస్తారా? అని ప్రశ్నించారు.

దొంగసొమ్ము ఎలా వెనకేసుకోవాలో, ఎలా పంచాలో జగన్‌కు బాగా తెలుసుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ధైర్యంతోనే వెయ్యి కోట్లు ఇస్తుంటే మీరు చూశారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మరని, ఇలా మాట్లాడానికి ఆయనకు సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.