కాంగ్రెస్ గెలిస్తే..పాకిస్తాన్ కు దీపావళి!

SMTV Desk 2019-03-26 10:11:09  bjp, gujarath chief minister vijay rupani, congress party, loksabha elections

గుజరాత్, మార్చ్ 25: బీజేపీ నేత గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్వహించిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ఆయన మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఒకవేళ గెలిస్తే.. పాకిస్తాన్ దీపావళి పండగ జరుపుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్‌లో పార్టీ చాలా మంది పాకిస్తాన్‌కు మద్దతిస్తున్నారు. దేశ ప్రజలెవరూ కాంగ్రెస్‌కు ఓటు వేయరు. మళ్లీ మోదీకే పట్టం కడతారు. అప్పుడు పాక్‌లో విషాద ఛాయలు అలముకుంటాయి’ అని రూపానీ అన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన బాలాకోట్ దాడులపై రాహుల్ గాంధీ సలహాదారుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను రూపానీ ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయం ప్రపంచమంతా తెలుసని, కానీ పాక్‌ను ఎందుకు నిందిస్తున్నారని పిట్రోడా ప్రశ్నించడం విచారకరమన్నారు.