చిన్ని కృష్ణకు కౌంటర్ రిప్లై ఇచ్చిన ఎస్ కె ఎన్

SMTV Desk 2019-03-25 19:12:10  chinni krishna, skn

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను డీ ఫేమ్ చేసేందుకు కొంత మంది బయటకి వచ్చినా దానికి తానూ సిద్ధమే అని పవన్ ఎప్పుడో కితాబిచ్చేశారు,అందుకు తగ్గట్టుగానే పవన్ పై బురద జల్లేందుకు చాలా మందే బయటకి వచ్చారు.అందులోను పవన్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో తాజాగా మెగా కుటుంబానికి చెందిన హీరోలకు ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన చిన్నక్రిష్ణ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.తాను పెట్టిన వీడియోలో చిరుకి ఇండస్ట్రీ హిట్ కథను తాను ఇస్తే కనీసం తనకి 10 రూపాయల పప్పన్నం కూడా పెట్టలేదని అలాంటి వారికి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలని వారి సామాజికవర్గ ప్రజలను ఓటర్లను ఉసిగొల్పే ప్రయత్నం చేసారు.

ఇదే సందర్భంలో మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయినటువంటి నిర్మాత ఎస్ కే ఎన్ చిన్ని కృష్ణకు ఇప్పుడు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు.చిన్నకృష్ణ కష్టాల్లో ఉన్నపుడు తనకి మెగా కుటుంబం ఎలాంటి సాయం చేసిందో ఆయన చెప్పిన మాటల వీడియోనే పెట్టి “అన్నం పెట్టిన చెయ్యి ని నరికే నమ్మక ద్రోహులు చాలా మంది ఉంటారు గరళం మింగిన శివుడు ఎలాగో అన్నయ్య చిరంజీవి అలాగే ఆయన స్పందిచక పోవచ్చు కానీ ఆ కాశీ విశ్వనాధుడే నీ లాంటి వాళ్ళని దించుతాడు చిన్ని కృష్ణ థూ” అంటూ ఒక సంచలన ట్వీట్ ను పెట్టి సమాధానం ఇచ్చారు.మరి చిన్ని కృష్ణ దీనికి ఏం సమాధానం ఇస్తారో చూడాలి.