జగన్ హామీలను కాపీ కొడుతున్న బాబు ?

SMTV Desk 2019-03-25 19:10:28  Jagan, AP Cm,

ఆంధ్ర రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారిపోతున్నాయి.రాష్ట్రంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అక్కడ పార్టీల నేతలు,నాయకులు రాష్ట్ర ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారు.గత ఐదు నెలల రాజకీయ పరిణామానాలను గమనించినట్టైతే విపరీతంగా పడిపోయిన చంద్రబాబు గ్రాఫ్ పోయిన జనవరిలో ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ మరియు పింఛనులు పెంపుదల ద్వారా గాడిలో పడింది.అప్పటి వరకు వృద్ధులకు 1000 రూపాయలు మాత్రమే ఉన్న పింఛనును 2000 వేలకు పెంచే సరికి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చంద్రబాబు హాట్ టాపిక్ గా నిలిచారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఈ హామీ రాష్ట్ర ప్రజలకు జగన్ ఎప్పుడో ఇచ్చేశారని వైసీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.చంద్రబాబు జగన్ హామీలను కాపీ కొట్టేశారని వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తునే టీడీపీ శ్రేణులను విమర్శించింది.ఆ సమయంలో జగన్ ఆ 2000 పింఛనును 3000 కు పెంచుతున్నాని సంచలనం సృష్టించారు.ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా చంద్రబాబు మరో సారి జగన్ హామీని కాపీ కొట్టేశారని చెప్పాలి.తాజాగా సాళ్ళురు పేటలో తాము అధికారంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు 2000 వేలు ఉన్న పింఛనను 3000కి పెంచుతున్నామని ప్రకటించేసారు.దీనితో జగన్ ఇచ్చిన హామీని మరోసారి కాపీ కొట్టేశారని చెప్పాలి.