స్పేస్ లో చైనా ఆర్మీ!

SMTV Desk 2019-03-25 19:08:24  china, china space army, China preparing for space warfare

బీజింగ్, మార్చ్ 25: చైనా సాంకేతిక రంగంలో ఎప్పుడూ ముందంజలో దూసుకుపోతూ ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడు తన ఆర్మీపై దృష్టి పెట్టింది. ఇతర దేశాల ఉపగ్రహాలను నాశనం చేసే లేదా పనిచేయకుండా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్, మొబైల్ పల్స్ నరేటర్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ పల్సెస్ అనే మూడు టెక్నాలజీల తయారీలో దూసుకుపోతోంది. ఈ మూడింటి శక్తిని ఎవరూ ఊహించలేరని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఆయుధాల తయారీలో అమెరికా ఇప్పటికే ఒక అడుగు ముందుండగా.. తాజాగా చైనాలోనూ అలాంటి బేస్‌లే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని చాలా ప్రాంతాల్లో ట్రాకింగ్ సెంటర్లు ఏర్పాటు చేయగా.. టిబెట్ లోని ఎన్గరీ ఇందులో ఒకటి. ప్రతి శాటిలైట్ కు చెందిన సమాచారాన్ని ఈ సెంటర్ అందిస్తుంది. ఆ తర్వాతి పనిని డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్..డీఈడబ్ల్యూ చూసుకుంటుంది. చైనాలో ప్రస్తుతం ఐదు డీఈడబ్ల్యూ సెంటర్లున్నాయి. వీటిలో జిన్జియాంగ్ లోని బేస్ ఒకటి. ఇక్కడ ఉన్న నాలుగు బిల్డింగుల సైజును బట్టి కెమికల్ లేజర్లు, నియోడిమియం లోహాలను ఆయుధాల్లో వాడుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. శత్రుదేశాల శాటిలైట్లను క్షణాల్లో పనిచేయకుండా చేయగల సత్తా ఎంపీజీకి ఉంది. వీటిని కూడా చైనా జిన్జియాంగ్ లోనే ఏర్పాటు చేసింది. ఇవి నాన్ న్యూక్లియర్ పల్స్ జనరేటర్స్ గా పనిచేస్తాయి. ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను సృష్టిస్తూ ఉపగ్రహాలను పనిచేయకుండా చేస్తాయి.