ఐశ్వర్య రాయ్‌ మళ్లీ ప్రెగ్నెంటా..?

SMTV Desk 2019-03-25 17:42:48  Aishwarya Rai , Bollywood Diva Aishwarya Rai ,

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ మళ్లీ తల్లి కాబోతున్నారా? ఆమె దిగిన ఓ బీచ్‌ ఫొటోను చూశాక అభిమానుల్లో మొదలైన సందేహం ఇది. ఇటీవల ఐష్‌ తన భర్త అభిషేక్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్యతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవా వెళ్లారు. అక్కడ ఐష్‌, అభి కలిసి బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్నప్పుడు స్థానిక మీడియా వర్గాలు వారి ఫొటోలు క్లిక్‌మనిపించాయి. అవి కాస్తా సోషల్‌మీడియాలోకి రావడంతో వైరల్‌గా మారాయి. ఎందుకంటే ఐష్‌ ఉదర భాగం కాస్త ముందుకు వచ్చినట్లుగా ఉంది. దాంతో ఆమె మళ్లీ తల్లి కాబోతున్నారా? అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బాలీవుడ్‌ మీడియా వర్గాలు ఐష్‌ మేనేజర్‌ను అడగ్గా.. అది కెమెరా యాంగిల్‌ పొరపాటని, ఐష్‌ గర్భిణి కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫొటోల ఆధారంగా వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా హెచ్చరించారు. గతంలో గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె ఓ ఫ్యాషన్‌ వేడుకకు హాజరైనప్పుడు తీసిన ఫొటోలు చూసి ప్రియాంక గర్భిణి అంటూ ప్రచారం చేశారు. దీనిపై ఆమె తల్లి మధు చోప్రా స్పందిస్తూ అందులో నిజం లేదని ఘాటుగా స్పందించారు.