ఈసీపై మండిపడ్డ సుప్రీం

SMTV Desk 2019-03-25 17:36:29  supreme court serious on central election commission, loksabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 25: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీవీప్యాట్లలోని ఓట్లలో కనీసం 50 శాతం కౌంటింగ్ చేయాలని పార్టీలు దాఖలు చేసిన పిటీషన్‌ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈసీ మాటలతో సంతృప్తి చెందని ఈసీ, తమ వైఖరిని రాతపూర్వకంగా అఫడవిట్‌ ఫైల్‌ చేయాల్సిందిగా చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ ఆదేశించారు. వీవీ ప్యాట్ లెక్కింపుల్లో ఈసీకి ఉన్న ఇబ్బందులు తెలియజేస్తూ మార్చి 28లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును ఏప్రిల్‌ 1వ తేదీకి వాయిదా వేసింది.