సద్దుమనిగిన ట్రంప్ ఎన్నిక వివాదం

SMTV Desk 2019-03-25 17:33:35  America shutdown, Donald trump

వాషింగ్ట‌న్, మార్చ్ 25: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు సంబంధించిన వివాదం సద్దుమణిగింది. దీంతో ఆయనకు అతిపెద్ద ఉపశమనం లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేసిన రాబర్ట్‌ ముల్లర్‌ నివేదికను క్రోడీకరించి అటార్ని జనరల్‌ విలియమ్‌ బార్‌ తాజాగ అమెరికన్‌ కాంగ్రెస్‌కు అందజేశారు. రష్యా జోక్యానికి సంబంధించినంత వరకు అధ్యక్షుడు ట్రంప్‌ పాత్రను కచ్చితంగా తేల్చలేదు. అలాగే ఆయన చట్టానికి వ్యతిరేకంగా ఏ చర్యకు పాల్పడినట్లు పేర్కొనలేదు. అసలు అమెరికాకు చెందిన ఏ వ్యక్తి ఈ కుట్రలో పాల్గొన్నట్లు గానీ, ట్రంప్‌ ప్రచార కర్తల కుట్ర గానీ, ఉద్దేశపూరక చర్యలుగానీ దీనిలో కనిపించలేదని వెల్లడించారు. కుట్రను నిరూపించడానికి ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఏమాత్రం సరిపోవని నాలుగు పేజీల రిపోర్టులో వెల్లడించారు.